మదనపల్లిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్: 13 వాహనాలు సీజ్.

0
2

మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి నగర్, లక్ష్మీనగర్, మంజునాథ కాలనీల్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

డీఎస్పీ పావని పర్యవేక్షణలో 11 బృందాలు, 125 మంది సిబ్బంది పాల్గొని 300 ఇళ్లను తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గల్లీలను నిఘాలో ఉంచారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 బైక్‌లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రజలు అపరిచితులపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.