తెలంగాణలో
TRS మళ్ళీ పుట్టింది
తెలంగాణ రాష్ట్ర సేన
కవిత కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం!
కెసిఆర్ మర మనిషి అని
ఈమధ్య రాజకీయ పరిణతి కోల్పోయారంటూ
తీవ్రంగా విమర్శించిన కవిత
ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్
అని BRS పార్టీ ఎక్స్ వేదికగా ఎద్దేవా!
అధికారంలోకి వస్తున్నాం
ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు
అని ప్రకటించిన TRS అధినేత కవిత!
మన పార్టీలో చేరనున్న ఎమ్మెల్యేలతో
ఈ రెండేళ్లు మనమే ప్రతిపక్షం
ఎన్నికల తరువాత మనదే అధికారం
BRS చేసిన తప్పులు సరిదిద్ది ప్రాయశ్చిత్తం చేసుకుంటా
కల్వకుంట్ల కవిత తండ్రి పై తిరుగుబాటు
ఒకప్పుడు బావ పై తిరుగుబాటు చేసి
హరికృష్ణ “అన్న టిడిపి” పార్టీ ఏర్పాటు
చిరునామా గల్లంతు
అన్న పై తిరుగుబాటు చేసి
షర్మిల పార్టీ పెట్టి ఆ దుకాణం కాంగ్రెస్ లో కలిపేసి
ఆ పార్టీ పగ్గాలు చేపట్టినా ఆంధ్రప్రదేశ్ లో
ఆ పార్టీకి ఉనికి లేని పరిస్థితి!
ఇప్పుడు తండ్రిపై తిరుగుబాటుతో
కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ TRS
పాత TRS ను పునరుద్దరిస్తాం అని
ప్రకటించిన కెటిఆర్ కు చెక్
కవిత రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి! పార్టీ పేరు, సిద్ధాంతాలు బావున్నాయి!
కానీ అప్పుడే ఎటాక్ మొదలైంది
కవిత పార్టీ TRS అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు…
అది.. తెలంగాణ రేవంత్ సేన










