ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!

0
4

ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖ ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే..

చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి చిరకాల స్వప్నాన్ని నేరవే రుస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీసీ సమ్మె విరమణ, చర్చలు, ప్రభుత్వ నిర్ణయాలపై డీసీసీ అధ్య క్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులతో పొన్నం శనివారం జూమ్ సమావేశం నిర్వహించారు. విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వారితో కలిసి పార్టీ క్యాడర్ సంబరాలు నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో 55 రోజుల సమ్మె చేసినా ఒక్క హామీ నెర వేర్చలేదని, 30 మందికి పైగా మరణించారన్నారు. ‘కార్మి కులతో మనకు శత్రుత్వం లేదు. వారు మన కుటుంబస భ్యులు. ఆత్మహత్య చేసుకున్న శంకర్డ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంద’ని చెప్పారు.