కోదాడ పట్టణంలో డీజిల్ , పెట్రోల్ కొరత

0
27

కోదాడ పట్టణంలో డిజిల్ కొరత తీవ్ర రూపం దాల్చి అత్యవసర పరిస్థితిని తలపిస్తుంది, ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సమ్మెతో నిలిచిపోయిన వేళ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో రవాణా వ్యవస్థ దాదాపు కుప్పకూలింది.

కోదాడ పట్టణంలో నో డీజిల్, నో పెట్రోల్ ,బోర్డులు కనిపిస్తున్నాయి వాహనదారులు గంటలు తరబడి క్యూలైన్లో నిలబడిన చివరికి ఖాళీ చేతులతో వెనుదిరూగుతున్న దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డీజిల్ కొరతతో రైతులు ఆటో డ్రైవర్లు , ట్రాన్స్ పోర్ట్ రంగం పూర్తిగా నిలిచిపోవడంతో సరుకు రవాణా లేక వ్యాపారాలు దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది.