అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
శనివారం రాత్రి ఉత్సవమూర్తులను రావణ వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు కాయ, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి సజ్జన కులస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు# కొత్తూరు మురళి.










