చీరాల :
దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరియు రిటైర్డ్ న్యాయమూర్తులను అవమానిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ను పదవి నుండి తొలగించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. అకివీడు ఘటనలో డిప్యూటీ స్పీకర్ ఆంధ్ర రాజాసింగ్ రఘురామకృష్ణ రాజుపై మత విద్వేష చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.
అలాగే, వైఎస్సార్‌సీపీ దళిత గళం సభను అకివీడులో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దళితులపై దాడులు, అరెస్టులు జరిగాయని ఆరోపిస్తూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.









