“అదిరిపోయే ‘కాక కేఫ్’ ప్రారంభం: రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
14

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రుచికరమైన తినుబండారాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలబోతగా అల్వాల్‌లో కొత్తగా కొలువుదీరింది “కాక కేఫ్” (KAKA CAFE)

అల్వాల్ రిట్రీట్ కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్‌ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  ఘనంగా ప్రారంభించారు.

స్థానిక మాజీ కార్పొరేటర్  చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే.. కేఫ్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. “యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలోకి రావడం శుభపరిణామం. ఇలాంటి కేఫ్‌ల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని కొనియాడారు.

కేఫ్ నిర్వాహకులు వినోద్ కుమార్, నరేందర్ లను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రావుల అంజయ్య, శివ గౌడ్, శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, యాదగిరి గౌడ్, సురేష్, సెంథిల్, ప్రేమ్, సాజిద్, రాజేందర్, అంజయ్య, నర్సింగ్ రావు, ప్రేమ్ కుమార్, రెహ్మత్ ఖాన్, లోకేష్, వెంకటేష్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు నిర్వాహకుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ప్రారంభోత్సవం ఆనందోత్సాహాల మధ్య కోలాహలంగా సాగింది.

#sidhumaroju

Alwal