నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతులు అధైర్య పడొద్దు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి….
1000 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు..
దుగ్గొండి మండల వెంకటాపురం సబ్ సెంటర్ మందపల్లి రోడ్డు తాడిచెట్ల వనం దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ప్రారంభించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ.. రైతులు పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర 2400 అందించే విధంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు…
వివిధ గ్రామ సర్పంచులు మరియు మాజీ ఎంపీటీసీలు మార్కెట్ డైరెక్టర్లు అధికారులు పాల్గొనడం జరిగింది…..








