నర్సంపేట మున్సిపాలిటీ భారత జనగణన సర్వే….

0
0

 

*నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.*

*భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి..*

*- నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్*…

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనగణన 2027 డిజిటల్ సర్వే ప్రక్రియలో భాగంగా నర్సంపేట పట్టణ ప్రజలందరూ స్వీయ గణన ( సెల్ఫ్ ఏంయుమరేషన్ ) చేసుకోవాలని పిలుపునిచ్చారు…

*ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ*…

– దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్వీయ గణన డిజిటల్ సర్వే అవకాశాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలినీ అన్నారు…

– ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కోరారు…

– స్వీయ గణన ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10,2026 వరకు కొనసాగుతుందినీ అన్నారు .

– జనగణనలో పాల్గొంటే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే అపోహలు పెట్టుకోవద్దని,వాస్తవానికి అర్హులైన వారికి పథకాలు మరింత సమర్థవంతంగా చేరడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

– దేశ భవిష్యత్తు ,ప్రణాళికలు మరియు సంక్షేమ పథకాల రూపకల్పనకు జనాభా లెక్కలు అత్యంత కీలకమని, జనాభా లెక్కల ప్రక్రియలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతని అన్నారు.

*ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్,DYSO & అడిషనల్ చార్జ్ ఆఫీసర్ విజేందర్,వార్డు ఆఫీసర్ సుష్మ,జనగణన సర్వే అధికారులు,మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…..