హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. ఇతర ఎంపీలు, డీసీసీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, బూత్ స్థాయిలో కేడర్‌ను చురుకుగా పనిచేయించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలి, పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. ‘సంఘటన్ సృజన్ అభియాన్’ ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలపడుతుందని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.







