భరత్ అవాజ్ న్యూస్ : ఉమ్మడి జిల్లాలో డీజిల్ కొరత ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు….
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత భారీగా ఏర్పడింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలోని పలు బంకుల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంకులో వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోలు, డీజిల్ కోసం గంటలత రబడి వేచి చూస్తున్నారు.
గడిచిన రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలో కొరత భారీగా ఏర్పడింది. వ్యవసాయ సీజన్ కావడంతో బంకుల్లో డీజిల్ అందుబాటులో లేదు. సరఫరా తగ్గడం వినియోగం పెరగడంతో వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరంగల్ నగరంతో పాటు పరకాల, నడికుడా, శ్యాయంపేట, ఆత్మకూర్, ఎల్కతుర్తి, చిట్యాల, మహబూబాబాద్ తో పాటు పలు మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది…








