మహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి గుగ్గిళ్ళ చనస్వీ 556 మార్కులతో మొదటి స్థానాన్ని,హరిదాస్యం అక్షయ 554 మార్కులతో రెండవ స్థానాన్ని, భైరబోయిన నళిన్ ప్రభాత్ 553 మార్కులతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుని జిల్లా పరిషత్ పాఠశాల నుండి విజయకేతనం ఎగిరేసినారు.అలాగే పాఠశాలలో 42 మంది విద్యార్థులకు 42 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలువేరు విష్ణువర్ధన్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కష్టపడ్డ ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తులో ఇలాంటి విజయాలను అందుకుంటారని కొనియాడారు. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు నెల్లుట్ల భాస్కర్ మాట్లాడుతూ.. ఈ యొక్క ఫలితాలను సాధించుటకు కృషిచేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కొనియాడుతూ సంతోషాన్ని తెలియజేశారు. అలాగే గ్రామ సర్పంచ్ ఈర్య ప్రతి ఉపాధ్యాయులకి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ గౌరవనీయులు వజ్జ నాగలక్ష్మి,ఉపాధ్యాయులకు,విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సుమన్ , సుధాకర్, రాజ్ కుమార్, సాంబయ్య,వసంత, జిమ్యాలాల్,సూరయ్య, శ్రీలత, మాధవి,మదన్మోహన్,బిక్షపతి.కల్తీ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.









