మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మండలంలోని మొత్తం 9 పాఠశాలలకు గాను 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను నమోదు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) గుమ్మడి లక్ష్మీనారాయణ తెలిపారు.
మండలంలోని వివిధ విద్యాసంస్థల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయిని
జడ్పీ హైస్కూల్స్: పొగలపల్లి (42)బత్తులపల్లి (8 ), ఓటాయి (4), ఎద్దులపల్లి (2) విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
కేజీబీవీ: 34 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు.
ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు: కొత్తగూడ బాయ్స్ (32), కొత్తగూడ గర్ల్స్ (32), సాదిరెడ్డిపల్లి (20) విద్యార్థులు విజయం సాధించారు.
గాంధీనగర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో బాలికలు అత్యధికంగా 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై మండలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు.
మండల టాపర్లుగా
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన బాలికలు మండల స్థాయి ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారుని .
తేజస్వి మండల్ టాపర్ 568, వైష్ణవి & బిందు: 563 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పంచుకున్నారు.
హసి ని : 562 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది.
ఏజెన్సీ మండలంలో ఇంతటి అద్భుత ఫలితాలు రావడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కృషిని, ఉపాధ్యాయుల బోధనా ను ఎంఈఓ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.









