మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసిన ఆరె సంక్షేమ సంఘం నాయకులు
ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చెట్టుపెల్లి గారి ఆధ్వర్యంలో సంఘం నాయకులు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆరె కులస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా స్పందించిన శ్రీమతి స్వర్ణ గారు, ఆ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి గారి అపాయింట్ మెంటు తీసుకొని ఆరె సంక్షేమ సంఘం నాయకులతో కలిసి చర్చించి వాటి పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు…
ఆమె ఇచ్చిన హామీ పట్ల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు….
ఈ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్, దుమాల సుధాకర్, కుడ్ల మనోహర్ రావు, నర్సింగ రావు, యుగంధర్, నాగేశ్వర్ రావు, రఘు,కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు….. భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి రిపోర్టర్ జి .రాము










