అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి వేగం.

0
4

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకుంటూ గణనీయ పురోగతి సాధిస్తున్నామని తెలిపారు.

సింగిల్ విండో విధానం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, గత 53 రోజుల్లో 687 దరఖాస్తులు రాగా, 676కు అనుమతులు మంజూరు చేశామని వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1.45 కోట్ల రాయితీలు, పీఎంఈజీపీ కింద రూ. 9.16 కోట్ల మార్జిన్ మనీ విడుదలైనట్లు తెలిపారు.