పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ (పునరావాసం మరియు పునరుద్ధరణ) పనులపై ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. 2027 ఫిబ్రవరి నాటికి పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను పూర్తి చేసి, అర్హులైన నిర్వాసితులకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు.వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వీఆర్ పురం మండల నిర్వాసితులు ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం సూచించిన మూడు ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకోవాలని సూచించారు.కూనవరం మరియు చింతూరు మండలాల్లోని గిరిజనేతర నిర్వాసితుల కోసం ప్రత్యేక లేఅవుట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వీరికి లాటరీ పద్ధతిలో ప్లాట్లను పారదర్శకంగా కేటాయిస్తామని వెల్లడించారు.నిర్వాసితులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని పీఓ కోరారు.
# Yadagiri









