చిలుకూరు గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు పాత చిలుకూరు వరకు వెళ్లాలంటే తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయని, అక్కడ కనీసం కూర్చోవడానికి కూడా స్థలము లేక ఇబ్బంది పడుతున్నాము అని కోరడం వలన వారికి ఇచ్చిన హామీ మేరకు గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన శ్రీమతి కొల్లు పుల్లమ్మ నాగయ్య .
పాలకవర్గ వార్డు సభ్యులు, పెన్షన్ దారుల కోరిక మేరకు కొత్త చిలుకూరు కమ్యూనిటీ హాల్ నందు పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య , ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగేశ్వరరావు , పాలకవర్గ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు, పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.









