“ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి.. రైతులకు ఇబ్బందులు కలగకూడదు: కలెక్టర్ స్నేహ శబరీష్”

0
6

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు కీలక సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన పంటను విక్రయించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన తాగునీరు, నీడ మరియు ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని స్పష్టం చేశారు.

ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా చూడాలని, గ్రేడింగ్ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా యంత్రాంగం పనిచేయాలని, నిబంధనల ప్రకారం ప్రతి గింజా కొనుగోలు చేసి సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.