సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌తో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, బ్యాంకులో శాలరీ అకౌంట్లు కలిగిన సింగరేణి ఉద్యోగులకు క్రింది బీమా ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి:
🔹 ప్రమాద బీమా: ₹1.20 కోట్లు
🔹 సహజ మరణ బీమా (టర్మ్ ఇన్సూరెన్స్): ₹10 లక్షలు
సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మార్గదర్శకత్వంలో డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) శ్రీ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం సాధ్యమైంది.
ఈ సందర్భంగా జి.ఎం (పర్సనల్) వెల్ఫేర్ & సి.ఎస్.ఆర్ శ్రీ జి.వి. కిరణ్ కుమార్ మాట్లాడుతూఉద్యోగుల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం సింగరేణి లక్ష్యమని తెలిపారు.
ఈ ఒప్పంద పత్రాలపై సింగరేణి మరియు బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజనల్ మేనేజర్ శ్రీ రిషికేశ్ రంజన్ కుమార్, సింగరేణి జీఎంలు శ్రీమతి కవితా నాయుడు, శ్రీ ఏజేఎం మురళీధర్ రావు, శ్రీ ఎన్.చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.









