మహిళల భద్రతపై కఠిన చర్యలు–సోషల్ మీడియాలోఅసభ్య పోస్టులకు చెక్.

0
2

మదనపల్లె జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ తో కలిసి శాంతిభద్రతలు, నేర నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.

సోషల్ మీడియాలో మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని, మహిళల ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.