రాష్ట్రంలో ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తూ, కృత్రిమ కొరత సృష్టించే బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్టాక్ ఉంచుకుని ‘నో స్టాక్’ బోర్డులు పెట్టే యాజమాన్యాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా వరి, ఆక్వా రైతులకు ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సోషల్ మీడియాలో ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.










