టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం.

0
2

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో నారా లోకేశ్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయన చేత ప్రమాణం చేయించారు.

లోకేశ్‌తో పాటు కొత్తగా ఎన్నికైన పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. యువతకు పెద్దపీట వేస్తూనే, క్షేత్రస్థాయి కార్యకర్తలకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించడం విశేషం. ఇకపై పార్టీని బలోపేతం చేయడంలోనూ, ప్రభుత్వ నిర్ణయాల్లోనూ లోకేశ్ పాత్ర అత్యంత కీలకం కానుంది.