పలు గ్రామాల్లో నేడు పవర్ కట్

0
1

బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్ నిర్వహణ పనులు కోసం శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు చెప్పారు.

 

పారాది, మెట్టవలస, గొర్లెసీతారాంపురం, నారాయణప్పవలసకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ అంతరాయనికి ప్రజలు సహకరించాలని కోరారు.

#Boiena Rajesh