రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి

0
3

ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్ ఈవెంట్స్‌లో విద్యార్థులు ఎలా పాల్గొంటున్నారు, అలాగే అక్కడి స్పోర్ట్స్ ట్రైనింగ్ మరియు ఎంపిక విధానం ఎలా కొనసాగుతోంది అన్న విషయాలను పరిశీలించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరియు వనపర్తి డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి,

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ, కృషి మరియు నిరంతర సాధన ఎంతో ముఖ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓఎస్డి మమత గారు, ప్రిన్సిపాల్, కోచ్‌లు, స్కూల్ సిబ్బంది మరియు స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు