మెదక్
మెదక్ పట్టణంలో ని కేర్ హాస్పిటల్ పసికందును నర్సు 1,50,000 రూపాయలకుఅమ్మిన విషయంలో జిల్ల కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యదికారి శ్రీరామ్ హిస్పిటల్ కేర్ దవాఖాన ను సీజ్ చేశారు.అక్రమ దత్తత నేరమని తెలిపారు.మౌలాలి కి చెందిన గర్భిణీ నస్రిమా పాతిమ డెలివరి కోసం గత నెల 12 న హాస్పిటల్ జాయిన్ అయ్యింది.రక్తం తక్కువగా ఉండటంతో కేర్ హాస్పిటల్ సిబ్బంది బ్లడ్ ఎక్కించి
13 న వైద్యులు డెలివరీ చేయగా
పసిపాపాకు నస్రిమా పాతిమ జన్మ నిచ్చింది.ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న నర్సు అక్తరీ బేగం పథకం ప్రకారం సిద్దిపేటజిల్లాకుచెందిన
మహమ్మద్ఇక్బరుద్దీన్,నదియా
సుల్తానదంపతులకు అమ్మింది.విషయం తెలుసుకున్న తల్లి ఫాతిమా తన పాపను తనకుఅప్పగించాలని భర్త అస్లాం ఖాన్ తో కలిసి మెదక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దింతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నలుగురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు మెదక్ పట్టణ సిఐ మహేష్ తెలిపారు.అనంతరం పట్టణ పోలీసులుపాపను సఖి కేంద్రానికి తరలించిన ఐసిడిఎస్ అధికారులు అప్పగించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ కు ఈ కేసు కు ఎలాంటి సంబంధం లేదని హాస్పిటల్ లో పనిచేసే నర్సు ఇలాంటి చర్యకు పాల్పడిందని తెలిపారు.









