● మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు
● ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థించిన ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 5: భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో వెలసిన శ్రీ దుర్గా ఎల్లమ్మ దేవస్థానంలో మహంకాళి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సుభిక్షంతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రతి ఏడాది భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ బోనాల వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని యూనియన్ అధ్యక్షుడు శ్యామ్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










