రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్‌ రావు

0
3

యూరియా అమ్మకాలపై ఆంక్షలు: రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం

రాష్ట్రంలో యూరియా అమ్మకాలను మౌఖిక ఆదేశాలతో నిలిపివేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టాక్ ఉన్నప్పటికీ డీలర్లు, అగ్రో సెంటర్లు రైతులకు ఎరువులు ఇవ్వకపోవడం దుర్మార్గమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు.

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన రేవంత్ సర్కార్, ఇప్పుడు యూరియాపై అనధికార నిషేధం విధించి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు డిక్లరేషన్ హామీలను గాలికొదిలేసిన ఈ ప్రభుత్వం ముమ్మాటికి “రైతు హంతక ప్రభుత్వమే” అని ఆయన విమర్శించారు. తక్షణమే ఈ అనధికారిక బ్యాన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.