మంచిర్యాల: పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల బస్టాండ్‌ను సుమారు రూ.20 కోట్లతో ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌తో కలిసి బస్టాండ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఆధునీకరణ పనులకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి టెండర్లు పిలిచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









