నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెరిచి ఉంచడంపై స్థానికుల ఆరోపణలు.

0
2

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నిరుగట్టువారిపల్లిలో మద్యం దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచే నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచుతున్నాయని స్థానికులు ఆరోపించారు. సమయపాలన పాటించకపోయినా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“నెల నెల ముడుపులు తీసుకుంటూ అధికారులు నిద్రపోతున్నారా?” అని ప్రశ్నించారు. మద్యం సేవించి యువకులు హంగామా సృష్టిస్తుండటంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.