మదనపల్లె: గాలివానకు చెట్టు కూలి కారుకు నష్టం.

0
3

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీలో బుధవారం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి ఓ చెట్టు విరిగి అక్కడ పార్క్ చేసి ఉన్న షిఫ్ట్ కారుపై పడింది.

దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఘటన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించారు. ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు