మత్తు కోరల్లో యువత – భవిష్యత్తు శూన్యం!

0
4

అరికట్టేది ఎన్నడూ…….?

ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి ప్రభాకర్

మహబూబాబాద్ మే 7: గంజాయి,అంబార్,డ్రగ్స్ తో పాటుగా గ్రామాల్లో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపు లను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ప్రగతిశీల యువజన సంఘం(PYL)కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 102 వ వర్ధంతి సందర్బంగా ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో  డ్రగ్స్, గంజాయి, అంబార్,బెల్ట్ షాప్ లను అరికట్టాలని ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేశారు. తాళ్లపెల్లి ప్రభాకర్ మాట్లాడుతూ యువత గంజాయి, మద్యానికి బానిసై సమాజ పట్ల వారి తీరు ప్రశ్నర్ధకంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర రాజధానిలో సీపీ పట్ల మద్యం మత్తులో ఆకాతాయిల తీరు చుస్తే విస్మయం కలుగుతోందని అన్నారు. యువత డ్రగ్స్, గంజాయి, అంబార్,మద్యం కు బానిస కాకుండా ఉండాలని కోరారు. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడి అమరులైన అల్లూరి తదితర అమరవీరుల ఆశయ సాధనలో యువత నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి భూర్కా బుచ్చిరాములు,పసునూరి రాజమల్లు, గజ్జి సోమయ్య, భూక్య రాంసింగ్, గట్టి సురేందర్,పూర్ణ చందర్,నిర్మల,జామ్లా, రాజేందర్,నరేష్, నగేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.