సాక్షి కథనాలు అవాస్తవం.. నాపై కుట్రలు చేస్తున్నారు!|

0
1

సాక్షి పత్రికలో తనపై వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నానని, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సదరు నేత స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులే తనపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.450 కోట్లు కాజేశాననే ఆరోపణల్లో వాస్తవం లేదని, బ్యాంకుల నుంచి చట్టబద్ధంగా లోన్ తీసుకున్నామని, నష్టాల వల్లే ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు రూ.44 కోట్లకు పైగా బకాయిలు చెల్లించినట్లు స్పష్టం చేశారు.

మంత్రి పదవిపై చర్చ వచ్చిన ప్రతిసారీ తనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజనిర్ధారణ కమిటీ వేస్తే పూర్తి ఆధారాలు చూపిస్తానని, దమ్ముంటే తనపై ఆరోపణలు చేస్తున్నవారు ఎక్కడైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తప్పుడు వార్తలు రాసిన పత్రికలు, వ్యక్తులపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.