● ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
● ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
సమాజ సేవే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవకు తమ వంతు సహకారం అందించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి హాజరై శిబిరాన్ని సందర్శించారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ, సూర్య, , లక్ష్మణ్, రాజనరసింహారెడ్డి, సురేందర్ రెడ్డి, ఆల్వాల్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










