కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు

0
5

నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో గ్రామస్థులు బుధవారం ఆందోళన చేశారు. కమ్మవారిపాలెం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం వద్ద మహిళలు ఖాళీ బిందెల తో నిరసన ప్రదర్శన చేశారు. గ్రామంలో వారం రోజుల నుండి మంచినీళ్లు రావటం లేదన్నారు. జలజీవన్ మిషన్ పధకం పనులు అసంపూర్తిగా వున్నాయని, గ్రామానికి వచ్చే ప్రధాన పైపు లైన్లు పగిలిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామంలో అక్రమ మెాటారు మంచి నీటి కనెక్షన్ లు తొలగించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు కర్రి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కమ్మవారిపాలెం గ్రామంలో తక్షణమే మంచి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా మంచి నీరు రాక దాహార్తి తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ారని, ట్యాంక్ ల ద్వారా మంచి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కమ్మవారిపాలెం గ్రామ సిపిఎం నాయకులు పత్తి పాటి శ్రీనివాసరావు,చెరుకుపల్లి రమేష్, సుబ్బారావు, శ్రీనివాసరావు, శ్రీరామనేని స్వామి, మంచి దనమ్మ, ఏలూరు సామాజ్ర్యం, చండ్ర దుర్గ, రాగి స్వామి, నాగలక్ష్మి, జగిని, గౌసియా నాయక్, గోపి నాయిక్, పలువురు మహిళలు పాల్గొన్నారు.