విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ నందు చదివించడం వలన ఆ డబ్బులు కూడా పోతాయి, పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత డబ్బు లేకపోతే వారు ఎలా బ్రతకాలి అనే విషయం ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లందు చేర్పించవలసిందిగా కోరడమైనది.
మా పాఠశాల నందు ఇంగ్లీష్ మీడియం నందు విద్యాభ్యాసము నేర్పించుచున్నాము. మా పాఠశాల నందు చదివిన చాలామంది విద్యార్థినీ విద్యార్థులకు టెన్త్ క్లాస్ నందు 500 పైనే మార్కులు వచ్చినాయి .కావున ప్రతి తల్లి తండ్రి ఆలోచించి మా పాఠశాల నందు మీ పిల్లలను చేర్పించవలసిందిగా కోరుచున్నాము.జి.లక్ష్మీనారాయణ తెలుగు మెయిన్ స్కూల్ హెడ్మాస్టర్ పూల చింత రోడ్.










