రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు.బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు.

0
1

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కోల్‌కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా కొలువుదీరుతున్న బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

చారిత్రాత్మక విజయం సాధించిన సువేందు అధికారి బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండగా, ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు విచ్చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం, ఉదయం విజయవాడ నుంచి బయల్దేరిన చంద్రబాబు.. మధ్యాహ్నం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. నూతన ప్రభుత్వానికి ఏపీ తరపున శుభాకాంక్షలు తెలిపి, అనంతరం సాయంత్రం నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు.