వరంగల్: మంటల్లో అన్నదాత ఆశలు!
భరత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లాలో 9మే నేడు పంట చేతికొచ్చిన వేళ రైతులు చేస్తున్న చిన్న పొరపాటు కోలుకోలేని దెబ్బ తీస్తోంది. వరి, మొక్కజొన్న కోతల అనంతరం పొలాల్లోని అవశేషాలను కాల్చివేస్తుండటంతో మంటలు అదుపుతప్పి పక్కనే ఉన్న కళ్లాలపైకి వ్యాపిస్తున్నాయి. ఫలితంగా వందల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలవుతోంది.
“ఉమ్మడి వరంగల్లో” సుమారు 50 ఎకరాలకు పైనే పంట నిప్పుపాలయింది. దీనివల్ల రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఓ రైతన్న నువ్వు ఆ పొరపాటు చేయకు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










