ఇండ్ల రిజిస్ట్రేషన్ లలో గ్రామ సెక్రెటరీ చేతివాటం…. 🔥🔥🔥|

0
1

నిజామాబాద్ జిల్లా మొగుపాల్ మండలం కులస్ఫూర్ గ్రామ పంచాయతీలో ఇండ్ల రిజిస్ట్రేషన్ల పేరిట భారీ కుంభకోణం వెలుగుచూసింది. గ్రామ కార్యదర్శి హనుమాన్ రాజు సుమారు 200 ఇండ్లకు పైగా రిజిస్ట్రేషన్ల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేసి, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా మోసానికి పాల్పడ్డాడు. తనకు అనుకూలమైన డాక్యుమెంట్ రైటర్ వద్దకే వెళ్లాలని నిబంధనలు పెట్టాడు. తీరా అత్యవసరాల కోసం బ్యాంకుల్లో లోన్లకు వెళితే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెల్లవని తెలియడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. గత పాలకమండలి, మాజీ సర్పంచ్ అండదండలతోనే ఈ అవినీతి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.