ఇంటి పెద్ద మరణిస్తే ₹20వేల ఆర్థిక సాయం అందించే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద 2025-26లో TGలో 15,420 మంది లబ్ధిపొందినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన ఈ పథకంపై దృష్టి సారించిందన్నారు. 18-60 ఏళ్ల వయసులో ఉన్న ఇంటి పెద్ద సహజ మరణం లేదా ప్రమాదంలో చనిపోతే ఈ సాయం అందుతుంది. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లు వ్యక్తి మరణించిన 2ఏళ్ల లోపు మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి.









