26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.

0
0

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, కూరగాయల వ్యాపారి హబీబ్ ఇంట్లో నిల్వ ఉంచిన దాదాపు 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల నుంచి కొనుగోలు చేసిన ఈ బియ్యాన్ని అద్దె ఇంట్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించిన అధికారులు, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.