అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.

0
1

మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు SP వెంకటాద్రి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశభక్తిని పెంపొందించుకున్న అల్లూరి తన గెరిల్లా యుద్ధ తంత్రంతో బ్రిటీష్ పాలకులను వణికించారన్నారు. ప్రాణత్యాగం చేసిన అల్లూరి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.