గుడిమెట్లలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

0
3

భక్తిశ్రద్ధలతో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహాల ప్రతిష్ట… విశేష పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య..!చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చి ఆలయ ప్రాంగణాన్ని జన సంద్రముగా మార్చారు. భక్తుల హారతులు, మంగళవాయిద్యాలు, ప్రత్యేక పూజలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూటమి నాయకులతో కలిసి పాల్గొని దేవాలయ అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

 

అనంతరం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే భక్తులకు అన్నదానం నిర్వహించి స్వయంగా భోజన వితరణ చేశారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సామూహిక భోజనంలో పాల్గొన్నారు.గ్రామ దేవతల మహోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు సమిష్టిగా కృషి చేయడం అభినందనీయమని తంగిరాల సౌమ్య గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్ర కార్పోరేషన్ల చైర్మన్లు మరియు డైరెక్టర్లు, కూటమి నేతలు,భక్తులు, గ్రామస్తులు,పెద్ద ఎత్తున స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు.