నందవరం మండల బిజెపి నేతలు లలిత జైన్ గారిని కలిశారు|

0
0

నందవరం మండలం బిజెపి నేతలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసేలా కష్టపడతామని బిజెపి నాయకులు తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామంలో ఓటర్ వెరిఫికేషన్ చేయించమని తెలియజేశారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మరియు ఎమ్మిగనూరు నియోజక వర్గం. BLA – 1 శ్రీ. లలిత్ జైన్ అన్న గారి చేతులు మీదుగా మన నందవరం మండలం యొక్క అన్ని బూతుల ఓటర్ లిస్ట్ దస్తా పత్రాలు ను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నందవరం మండల అధ్యక్షులు శ్రీ .మఠం రాజశేఖర్ స్వామి మరియు మండల కిసాన్ మోజ్ అధ్యక్షుడు బోయ భీమయ్య గారు మరియు నందవరం మండల ప్రధాన కార్యదర్శిలు గవ్వల నారాయణ మరియు చెంచు మహేష్ లు పాల్గొనడం జరిగింది.