నందిగామ పట్టణంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (నందిగామ బ్రాంచ్ )వారు బాటసారుల దాహార్తిని తీర్చడానికి గాను బ్యాంక్ చైర్ పర్సన్ నెట్టెం శ్రీరఘురామ్ పిలుపు మేరకు మధిర ఆర్చ్ వద్దగల ఏ సి పి కార్యాలయం సమీపంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు.
ఈ చలివేంద్రాన్ని బ్రాంచ్ మేనేజర్ పి బాబూరావు సహకార సంఘాల చైర్ పర్సన్స్ తో కలిసి ప్రారంభించి బాటసారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాల చైర్ పర్సన్స్ తో పాటు నందిగామ పురపాలక సంఘ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణ కుమారి,బ్యాంక్ సూపర్వైజర్ బండి శ్రీను బ్యాంక్ సిబ్బంది సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.










