రూ 10 లక్షలతో మంచినీటి పైప్ లైన్ పనులుకు శ్రీకారం చుట్టారు

0
1

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.నందిగామ పట్టణం కాకాని నగర్‌లో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నాయకులతో కలిసి 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాకాని నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ పైప్‌లైన్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న ఆమె, ప్రతి వార్డులో సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, వివిధ రాష్ట్ర కార్పోరేషన్ల డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రాంతీయ ప్రజలు పాల్గొన్నారు.