లక్షెట్పేట్ వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
1

మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఇటీవల గోడ కూలిన ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను రైతులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎంపీ, కలెక్టర్‌తో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే లారీలు, ట్రాక్టర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వడ్లలో అనవసర కటింగ్లు జరగకుండా మిల్లర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.