Graveyard land proposal for Malkajgiri District collector

0
1

📰 HMT నగర్ డివిజన్‌లో స్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

హైదరాబాద్: హెచ్ఎంటి నగర్ డివిజన్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవుల స్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతూ ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ శ్రీ మను చౌదరి, ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

 

హెచ్ఎంటి నగర్ కొత్తగా ఏర్పడిన డివిజన్ అని, ఇక్కడ సుమారు 50 వేలకుపైగా జనాభా ఉన్నప్పటికీ హిందూ, ముస్లిం, క్రైస్తవుల కోసం ప్రత్యేక స్మశాన వాటికలు అందుబాటులో లేవని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానికంగా ఎవరైనా మృతి చెందినప్పుడు కుటుంబ సభ్యులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

 

ఈ నేపథ్యంలో హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు తూర్పు వైపున, లక్ష్మీ స్టార్చ్ కంపెనీ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్మశాన వాటికల కోసం కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.

 

వినతిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఉప్పల్ తహసీల్దార్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

 

స్థానిక ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

 

📍భారత్ ఆవాజ్ | స్థానిక వార్తలు

📰 ప్రజా సమస్యలపై ప్రత్యేక కథనం