కొడుకుపై ఆరోపణలు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..

0
2

తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు.

‎ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని పాటిస్తూ వచ్చాను.

‎తన రాజకీయ జీవితంపై ఎలాంటి మచ్చలేదని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది.

రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని వారు ఇప్పుడు కుటుంబ సభ్యులు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

‎ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమే.

‎గ్రామీణ స్థాయి నుంచి ఎదిగి కార్పొరేటర్‌గా, అక్కడి నుంచి ప్రజల మద్దతుతో కేంద్ర మంత్రిగా ఎదిగిన బీసీ నాయకుడి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

‎ప్రధాని నరేంద్ర మోడీ సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు తెరపైకి తెస్తున్నారు.

‎నిజం ఏమిటో న్యాయస్థానమే తేలుస్తుందని, ప్రతి కుట్రను కాలమే బయటపెడుతుంది – బండి సంజయ్