శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
మండలంలోని పోతంవారి పల్లె సమీపంలోని బంగారం చింత ప్రదేశంలో ఒంటరి ఏనుగు ఉన్నట్లు చెప్పారు. పోతంవారిపల్లి, సీలయ్య గారి పల్లి, బత్తలవారి పల్లి, నాయనవారిపల్లె గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళలో తెల్ల దుస్తులతో పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలను విధిగా పాటించాలని కోరారు# కొత్తూరు మురళి .









