“అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్: మంత్రి లోకేశ్”

0
4

నారా లోకేశ్ సింగపూర్ పర్యటనలో అమరావతిలో పుంగోల్ తరహా భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని తెలిపారు. జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సింగపూర్ సహకారం కీలకమన్నారు.

ఇప్పటికే భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆర్‌ఎఫ్‌పీ జారీ చేసినట్లు వెల్లడించారు. అమరావతికి పూర్తి చట్టబద్ధత రావడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ప్రపంచ బ్యాంకు మద్దతుతో టౌన్‌షిప్ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.